23-08-2025 12:00:00 AM
మహబూబ్ నగర్ ఆగస్టు 22 (విజయ క్రాంతి) : తెలంగాణ వచ్చింది సబ్బండ వర్గా ల ప్రజలకు సకల సౌకర్యాలు కల్పించామని చెబుతున్న గత ప్రభుత్వము పేదవారి కడుపుమార్చి వారి కన్నీళ్ళతో కాలం గడిపారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజక వర్గంలోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల లో దేశ్పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను, పద్మావతి కాలనీలో గ్రీన్ బెల్ట్ లో ఉన్న రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం తువ్వగడ్డ లో రూ 20 లక్షలతో ఫత్తేపూర్ గ్రామంలో రూ 20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనాన్ని, ఎస్సి సబ్ ప్లాన్ క్రింద రూ 25 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డు ను, ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ, కొత్తగా వేసిన బోరు మోటారు ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలను ఉద్దేశించి ఎమ్మెల్యే మా ట్లాడుతూ గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆరోపించారు.
రేషన్ కార్డులు ఇవ్వకుండా పేదవారి కడుపు మార్చిందన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని మోసం చేశారని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగిందని, గృహజ్యోతి పథకం కింద పేదవారికి 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిర మ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని, పేదవారి కడుపు నింపేందుకు రేషన్ కార్డులు ఇచ్చి, రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామని, రైతు బంధు ఇస్తున్నామని, వారు పండించిన పంటకు మద్దతు ధర, బోనస్ కూడా ఇస్తున్నామని, రైతు కూలీలకు సైతం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నట్లు చెప్పారు.
త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు వస్తాయని హామీ ఇచ్చారు. మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న ప్రజా ప్రభుత్వాన్ని నిండుమనసుతో దీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ,నా యకులు సుధాకర్ రెడ్డి, శాంతన్న యాదవ్, రమేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, గోవింద్ యాదవ్, పండరి నాథ్, చంద్రా నాయక్, మంగ్య నాయక్, శంకర్ నాయక్, ప్రవీణ్ కుమార్, రాజు యాదవ్, భాస్కర్, నరేష్, రాజు నాయక్, రాము నాయక్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.