calender_icon.png 23 August, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతులు లేని పురుగుల మందు అమ్మితే సీజ్ చేస్తాం

23-08-2025 12:00:00 AM

వ్యవసాయ అధికారి లావణ్య

చర్ల , ఆగస్టు 22 (విజయ క్రాంతి); పురుగుల మందు దుకాణాల్లో కల్తీ మందులు అమ్ముతున్నారని ఆరోపణలతో భద్రాచలం ఏడిఏ బి. సుధాకర్ రావు, చర్ల వ్యవసాయ అధికారి లావణ్య కలిసి ఆర్.కొత్తగూడెం, అంజనాపురం, చిన్నమిడిసిలేరు, చర్ల గ్రామాలలోని వివిధ ఎరువులు , పురుగుమందుల దుకాణాలను పరిశీలించారు. పరిశీలనలో, కొంతమంది డీలర్ల వద్ద రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం గుర్తించబడింది.

ఈ కారణంగా సంబంధిత దుకాణాలకు స్టాప్ సేల్ నోటీసులు జారీ చేయబడినవి.ఈ విషయం పై శుక్రవారం చర్ల రైతు వేదిక నందు మండలం లోని ఇన్పుట్ డీలర్స్ అందరికి సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో  రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేయబడినవి. దుకాణాలలో  అనుమతులు లేని బయో ఉత్పత్తుల విక్రయం నిలిపివేయాలని, స్టాక్ రిజిస్టర్లు, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని స్పష్టమైన సూచనలు చేశారు.