13 April, 2026 | 12:28 AM

ఒక్క వాటర్ బాటిల్ ధర.. రూ.1.15 లక్షలు

19-12-2024 12:00 AM

సాధారణంగా ఒక లీటర్ బాటిల్ రూ.20 ఉంటుంది. మరీ బ్రాండెడ్ అయితే మరో పది రూపాయలు ఎక్కువగా ఉండొచ్చు. కానీ, మీరు ఎప్పుడైనా ఒక లీటర్ నీటి కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారా? ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ సోషల్ మీడియా లో తెగ సందడి చేస్తోంది. ఈ బాటిల్ కొన్న డబ్బుతో ఓ చిన్నపాటి కారు లేదంటే, ఓ ఐఫోన్ కొనుక్కోవచ్చు.

అవు ను.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ జపాన్ మినరల్ వాటర్ బ్రాండ్ ఫెలికో జ్యువెలరీ తయా రు చేసింది. ఈ బాటిల్ డిజైన్‌తో పాటు అందులోని నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుందని చెబుతున్నారు. అందుకే ఒక లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.1.15 లక్షలు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్. ఇందులో నీరు కూడా అత్యంత స్వచ్ఛమైనదిగా చెబుతున్నారు. 

బాటిల్ నీరు జపాన్ కోబ్ రోకౌ నేషనల్ పార్క్‌లో ఉంది. ఈ పార్క్ పరిసరాల్లో ఎలాంటి పారిశ్రామిక, వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు లేకుండా పూర్తి స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది. అందుకే దాని స్వచ్ఛత, అధిక ఖనిజ పదార్థాలకు ప్రసిద్ధి చెందింది. ఈ నీటిలో ఆక్సిజన్ కంటెం ట్ చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. కంపెనీ ఈ నీటిని గ్రానైట్ వడపోత ప్రక్రియ ద్వారా ఫిల్టర్ చేస్తుం ది. దీనిలో అన్ని రకాల మలినాలు సహజంగా నీటి నుంచి తొలగించబడతాయని చెబుతున్నారు.

అందుకే 750 ఎంఎల్ వాటర్ బాటిల్ ధర సుమారు రూ.1.15 లక్షలకు విక్రయిస్తున్నారు. అంతేకాదు.. దీని బాటిల్ కూడా ప్రత్యేకం. జపనీస్ ఫిలికో బాటిల్ రూపకల్పనకు కూడా ప్రసిద్ధి చెందింది. కంపెనీ వాటర్ బాటిళ్ళను వివిధ రకాల వజ్రాలు, ఆభరణాలతో అలంకరిస్తుంది. బంగారు కోటింగ్‌తో తయారు చేసిన ఈ బాటిల్ మూత వజ్రాలతో పొదిగి ఉంటుంది.