ఫెడ్ భయాలు..వెల్లువెత్తిన అమ్మకాలు
* సెన్సెక్స్ 1,064 పాయింట్ల పతనం
* 24,400 దిగువకు నిఫ్టీ
ముంబై, డిసెంబర్ 17: యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశం నేపథ్యంలో భయాలు తలెత్తడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగపడ్డారు. దీనితో మంగళవారం స్టాక్ సూచీలు నిలువునా పడిపోయా యి. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 1,136 పాయింట్లు క్షీణించి 80,612 పాయింట్ల కనిష్ఠస్థాయికి పడిపోయింది చివరకు1,064 పాయింట్లు నష్టపోయి 81,000 పాయింట్ల స్థాయి దిగువన 80,684 పాయింట్ల వద్ద నిలిచింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 332 పాయింట్ల భారీ నష్టంతో 24,400 పాయింట్ల స్థాయి దిగువన 24,336 పాయింట్ల వద్ద ముగిసింది.
సూచీలు క్షీణించడం వరుసగా ఇది రెండో రోజు. సోమవా రం సెన్సెక్స్ 384 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్ల చొప్పున తగ్గాయి. మంగళవారం బీఎస్‌ఈలో ట్రేడయిన షేర్లలో 2,442 నష్టపోగా, 1,576 స్టాక్స్ లాభపడ్డాయి. భారత మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలివెళుతుండటం, గ్లోబల్ ట్రెండ్ ప్రతికూలంగా ఉండటం స్థానిక మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపిందని ట్రేడర్లు చెప్పారు. ఆసియాలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాం గ్‌లు నష్టాలతో ముగిసాయి.
బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ కొరత
దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో గత ఆరు నెలల్లో ఎన్నడూలేనంతగా లిక్విడిటీ కొరత తలెత్తడంతో బ్యాంకింగ్ షేర్లలో భారీ అమ్మకాలు జరిగాయని, దీంతో బ్యాంక్ నిఫ్టీ 1.5 శాతం నష్టపోయిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దేవర్ష్ వకీల్ చెప్పారు. అడ్వాన్సు టాక్స్ చెల్లింపులు, రిజర్వ్‌బ్యాంక్ డాలర్లను విక్రయించడం తదితర కారణాల తో బ్యాంక్‌ల్లో నగదు కొరత ఏర్పడిందన్నారు. వడ్డీ రేట్ల కోతకు ఫెడ్ విరామం ఇవ్వడం లేదా వచ్చే ఏడాది తక్కువ కోతలు ఉంటాయన్న సంకేతాల్ని ఫెడ్ వెల్లడించవ చ్చన్న అందోళన అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్నదని, ఈ అంశం మార్కె ట్ క్షీణతకు ప్రధాన కారణమని వకీల్ వివరించారు.
ఎఫ్‌పీఐల భారీ విక్రయాలు
డిసెంబర్ తొలి రెండు వారాల్లో నిక ర కొనుగోళ్లు జరిపిన విదేశీ పోర్ట్‌ఫోలి యో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) తిరిగి భారీ అమ్మకాలకు పాల్పడ్డారు. మంగళవా రం ఎఫ్‌పీఐలు రూ.6,409 కోట్ల విలువైన ఈక్విటీలను నికరంగా విక్రయించి నట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సోమవా రం రూ.278 కోట్ల పెట్టుబడుల్ని మార్కె ట్ నుంచి వెనక్కు తీసుకున్నారు.




