calender_icon.png 12 January, 2026 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడిసెవాసుల సమస్యలు అధికారుల దృష్టికి..

08-01-2026 12:31:51 AM

దాసారం బస్తీలో ఎమ్మెల్యే తలసాని పర్యటన

సనత్‌గర్ జనవరి 7 (విజయక్రాంతి):- మీరు ఎవరికి భయపడొద్దు... మీకు అండగా ఉంటామని మాజీమంత్రి, డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ దాసారం బస్తీ గుడిసె వాసులకు భరోసా ఇచ్చారు. ఇటీవల సనత్ నగర్ లోని దాసారం బస్తీలో గుడిసె వాసులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి తమ గుడిసెలు ఖాళీ చేయాలని కొంతమంది వ్యక్తులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విన్నవిం చారు.

స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం అధికారులతో కలిసి దాసారం బస్తీలో పర్యటించి స్థానిక గుడిసె వాసుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అమీర్ పేట సర్కిల్ సుజాత, టౌన్ ప్లానింగ్ ఏసీపీ రమే ష్, ఆర్‌ఐ సుధీర్, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, సనత్ నగర్ డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, దాసారం బస్తీ వాసులు తిరుమలయ్య, తిమ్మన్న, నాయకులు సురేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సంతోష్ కుమార్, ఖలీల్, శేఖర్, రాజేష్ ముదిరాజ్, జమీర్ తదితరులు ఉన్నారు.