calender_icon.png 11 January, 2026 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలి

08-01-2026 12:31:51 AM

కలెక్టర్ అభిలాష అభినవ్ 

నిర్మల్, జనవరి 7 (విజయక్రాంతి):  జిల్లా ప్రజలు ఆకార్ ఆశా హాస్పిటల్ (కూకట్పల్లి, హైదరాబాద్) ద్వారా అందిస్తున్న ఉచిత పునర్నిర్మాణ శస్త్ర చికిత్స సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌లో ఆకార్ ఆశా హాస్పిటల్కు చెందిన వైద్యులు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలసి, తమ హాస్పిటల్లో ఉచితంగా అందిస్తున్న వైద్య సేవల వివరాలను తెలియజేశారు. అనంతరం ఉచిత శస్త్ర చికిత్సలకు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆకార్ ఆశా హాస్పిటల్ వారు పునర్నిర్మాణ శస్త్ర చికిత్సలను పూర్తిగా ఉచితంగా నిర్వహించడంతో పాటు, చికిత్స పొందే వారికి ఉచిత భోజనం, ఉచిత వసతి సదుపాయాలు కూడా కల్పిస్తున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన బాధితులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్, కార్యక్రమ నిర్వహణ అధికారి డాక్టర్ సౌమ్య, ఆకార్ ఆశా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ లిఖిత గుప్తా, డాక్టర్ శాలిని, డాక్టర్ మంజుల పాల్గొన్నారు.

అటవీ గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా చేపట్టాలి

జిల్లాలోని అటవీ ప్రాంత ప్రజలందరికీ మెరుగైన సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.     బుధవారం సాయంత్రం కలెక్టరే ట్లోని సమావేశం మందిరంలో జిల్లా స్థాయి అటవీ కమిటీ (డిఎల్ సి) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అటవీ, గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా, విద్యుత్, తదితర మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతా ల్లో చేపట్టే అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు అటవీ శాఖ అధికారులు సహకరించాలని చెప్పారు.

అభివృద్ధి పనులకు సంబంధించి తమ పరిధిలో ఉన్న అటవీ అధికారులు శాఖాపరమైన అనుమతులు వీలైనంత త్వరగా ఇవ్వాలన్నారు. పివిటిజి మండలాల్లో ఇందిర మ్మ ఇండ్ల నిర్మాణాలకు అడ్డంకులను తొలగించాలని అన్నారు.

అవసరమైతే రెవెన్యూ, అటవీ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డిఎఫ్‌ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఆర్డిఓ రత్నకళ్యాణి, ఎడి సర్వే & ల్యాండ్ రికార్డ్ ఆర్. సుదర్శన్, పిడి హౌసింగ్ రాజేశ్వర్, రెవెన్యూ, ఇంజనీరింగ్,విద్యుత్ శాఖల అధికారులు, తహసిల్దార్ లు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఓటర్ జాబితా ఫిర్యాదులపై చర్యలు

మున్సిపాలిటీ ఓటర్ జాబితాల పై వచ్చిన అభ్యంతరాలను ఫిర్యాదులను నిర్ణిత  గడువు లోపు పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సమగ్ర ఓటర్ల జాబితా పోలింగ్ ఏర్పాటు ఫిర్యాదులపై తక్షణ స్పందించాలని ఆదేశించినట్టు తెలిపారు అభ్యంతరాల ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పరిశీలించి, పరిష్కరించాలన్నారు. 2025 సంవత్సరం సంబంధించి 3వ సప్లిమెంటరీ ఓటరు జాబితా నవంబర్ 15 న విడుదలైందని, దాని ప్రకారం పట్టణాలలో వార్డుల వారీగా డ్రాఫ్ట్ ఓటరు జాబితా జనవరి 1న విడుదల చేశామని తెలిపారు.