calender_icon.png 12 January, 2026 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ దరఖాస్తులపై అలసత్వం వద్దు

08-01-2026 12:33:11 AM

అధికారులకు కలెక్టర్ రాజర్షి షా ఆదేశం

ఆదిలాబాద్, జనవరి 7 (విజయక్రాంతి):  రెవెన్యూ శాఖ పరిధిలోని పెండింగ్ దరఖాస్తు లు, భూ సమస్యలు, వివిధ సంక్షేమ పథకాలతో సంబంధం ఉన్న వినతులను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డు శాఖల అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు.

ముఖ్యం గా భూ భారతి కింద 60 రోజులకు మించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. సదాబైనామా దరఖాస్తులు, అసైన్డ్ భూముల సమస్యలు, రెవెన్యూ సదస్సులలో వచ్చిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. రైతు ఆత్మహత్యలు, పిడుగుపాటు మరణాలు, హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించిన నివేదికలను త్వరగా పూర్తిచేసి బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న కుల ధృవీకరణ పత్రాల జారీ, బాధితుల బ్యాంక్ ఖాతాల వివరాల సేకరణ వంటి అంశాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి అంశంపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పారదర్శకంగా ప్రక్రి య పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ యువరాజ్ మర్మాట్, డిప్యూటీ కలెక్టర్ వంశీ కృష్ణ, ఆర్డీఓ స్రవంతి, సర్వే ల్యాండ్ సహాయ సంచాలకులు ప్రభాకర్, వివిధ మండలాల తహసీ ల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.