calender_icon.png 3 December, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

03-12-2025 12:00:00 AM

కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

జనగామ, డిసెంబర్ 2 (విజయక్రాంతి): ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు.. మొదటి అంకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి.. జనగామ మండలం వడ్లకొండ, నర్మెట్ట మండలం నర్మెట, మచ్చు పహాడ్, తరిగొప్పుల మండలం పోతారాం గ్రామపంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న రెండవ విడత నామినేషన్ ప్రక్రియను అలాగే హెల్త్ డిస్క్ లో అధికారుల పనితీరును కలెక్టర్ మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా.. ఎన్నికల విధులను నిర్వహిస్తున్న అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ... నామినేషన్ పత్రాల పరిశీలనలో భాగంగా ఏయే ఏయే పత్రాలను పరిశీలిస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. పత్రాల పరిశీలన వేగవంతంగా జరగాలని, హెల్ప్ డెస్క్ లో తగు సిబ్బందిని పెట్టుకొని నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థులకు ఉండే సలహాలను నివృత్తి చేసి.. నామినేషన్ దాఖలు చేసేందుకు వారికి సహకరించాలన్నారు.

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. చివరి రోజున ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నందున, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.చివరి సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని, అందుకని అభ్యర్థులు ముందు జాగ్రత్తగా అన్ని సరిగ్గా చెక్ చూసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్లు ఎంపీడీవోలు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.