03-12-2025 12:00:00 AM
-అమ్మి నెల దాటినా చెల్లింపులు సున్నా
-మానుకోట జిల్లాలో రూ.8 కోట్ల బకాయి
-ఇబ్బందులు పడుతున్న రైతులు
మహబూబాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): మద్దతు ధరకు మొక్కజొన్నలను రైతుల నుంచి కొనుగోలు చేసి, నెలరోజులు దాటినప్పటికీ డబ్బులు ఖాతాల్లో జమ చే యకపోవడంతో రైతులు నిరీక్షిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో మొక్కజొన్నలకు మద్దతు ధర లభించకపోవడంతో ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా అక్టోబర్ నెలలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చింది.
మహబూబాబాద్ జిల్లాలో అక్టోబర్ నెలలో పది చోట్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. బహిరంగ మార్కెట్‌లో మొక్కజొన్నలకు క్వింటాలుకు రూ.2 వేల లోపు ధర లభిస్తుండటంతో మా ర్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు రూ.2,400 చెల్లించారు. రైతులు పెద్ద ఎత్తున మొక్కజొన్నలను మార్క్‌ఫెడ్ సంస్థకు విక్రయించారు.
జిల్లా వ్యాప్తంగా సంస్థ ఏర్పాటు చేసిన కేంద్రాల్లో సుమారు 790 మంది రై తులు వేల క్వింటాల మక్కలు విక్రయించారు. రైతుల నుంచి సేకరించిన మొక్క జొన్నలకు జిల్లా వ్యాప్తంగా రూ.8 కోట్లకు పైగా మార్క్‌ఫెడ్ సంస్థ బకాయి పడింది. నెల రోజులు దాటుతున్నప్పటికీ రైతులకు డబ్బులను ఇప్పటివరకు ఒక్క పైసా చెల్లించకపోవ డంతో యాసంగి పెట్టుబడులకు రైతులు ఆ ర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
వారం రోజుల్లో బకాయిలు చెల్లిస్తాం శ్యామ్, మార్క్‌ఫెడ్ అధికారి, మహబూబాబాద్ జిల్లా
మార్క్‌ఫెడ్ సంస్థకు మొక్కజొన్నలు విక్రయించిన రైతులకు బకాయి పడ్డ డబ్బులను వారం రోజుల్లోగా చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటాం. జిల్లావ్యాప్తంగా 10 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి 8 కోట్ల రూపాయల విలువైన మొక్కజొన్నలను కొ నుగోలు చేశాం. ఇప్పటికే బకాయి డబ్బులు చెల్లింపు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. రైతులకు చెల్లించాల్సిన బకాయిలను పూర్తిగా వారం రోజుల్లో చెల్లించే విధంగా కృషి చేస్తున్నాం.
మక్కలు అమ్మి నెల దాటింది
మార్క్‌ఫెడ్ సంస్థకు 30 క్విం టాళ్ల మక్కలను అక్టోబర్ 29న విక్రయించాను. 72 వేల రూపాయలు రావాలి. నెలరోజులు దాటినా డబ్బులు ఖాతాలో జమ చేయడం లేదు. మక్కల డబ్బుల కోసం అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఇప్పుడు అప్పుడు అంటూ దాటవేస్తున్నారు. మొక్కజొన్న పంట కోతకు వచ్చిన కూలీలకు, ఇతర పెట్టుబడికి డబ్బులు చెల్లిం చాల్సి ఉండడంతో వాళ్లు ఇంటి చుట్టూ తిరిగిపోతాండ్లు. యాసంగి పెట్టుబడి కోసం ఇప్పుడు మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పెద్ది ఉపేందర్, రైతు
మద్దతు ధర కోసం ఆశపడితే..
ప్రైవేట్ ట్రేడర్ కు విక్రయిస్తే క్విం టాలుకు 400 రూపాయలు నష్టపోతామని భావిం చి, మద్దతు ధర దక్కుతుందని ఆశపడి మార్క్‌ఫెడ్ సంస్థకు విక్రయిస్తే నెలరోజులు దాటినా డబ్బులు ఇవ్వడం లేదు. యాసంగి పం టల సాగు కోసం పెట్టుబడికి అందుతుందని ఆశించాను. 24 క్వింటాల మొ క్కలు అమ్మితే 57 వేల రూపాయలకు పైగా నాకు చెల్లించాల్సి ఉంది. పైసల కోసం తిరుగు తూనే ఉన్నా. వారం రోజుల్లో బకాయిలు చెల్లిస్తాం
విరబోయిన రవి