విద్యాభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
- ప్రభుత్వ స్కూళ్ళలో మెరుగైన వసతులు
- ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల, మే17(విజయక్రాంతి):విద్యాభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముందుకుసాగుతుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 11 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు విద్యాశాఖ విజయోత్సవం ముగింపు సందర్భంగా జిల్లా సమీకృత కార్యాల యాల సముదాయంలో ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు. పదో తరగతి, ఇంటర్లో ఉత్తమ ప్రతిభ చూపిన. వివిధ స్పోరట్స్ అండ్ గేమ్స్ లో రాణించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, సర్టిఫికెట్లు అందజేసి.. అభినందించారు.పదో తరగతి, ఇంటర్ లో మొత్తం 11 మంది విద్యార్థులు మంచి మార్కులు సాధించగా, లక్ష రూపాయలు ప్రోత్సాహం కింద అందజేశారు.బడికి తక్కువ సెలవులు తీసుకుని హాజరు అయిన టీచర్లను సన్మానించారు.జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప రెడ్డి, డీఈఓ జగన్ మోహన్ రెడ్డి, వివిధ మండలాల ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు






