28 August, 2026 | 2:01 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

పురుషః వచ్చేది అప్పుడే

09-05-2026 12:18 AM

కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు ‘పురుషః’ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్‌కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతున్న ఈ మూవీకి వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, వీటీవీ గణేశ్, స ప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, వి షిక, హాసిని సుధీర్ వివిధ పాత్రలను పోషించారు. ఇప్పటికే పోస్టర్లు, పాటలు, గ్లింప్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.

తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. వేసవి కానుకగా మే 22న ఈ మూవీని రిలీజ్ చేయబోతోన్నారు. కుటుంబమంతా కలిసి నవ్వుతూ వినోదం పొందేలా ఈ చిత్రం ఉంటుందని టీమ్ పే ర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సతీశ్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్‌గా రవిబాబు దొండపాటి పనిచేస్తున్నారు.