17 April, 2026 | 3:25 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

నాణ్యత మూన్నాళ్ల ముచ్చటేనా!

31-05-2025 12:04 AM
  1. హడావుడి పనులు... కొరవడిన పర్యవేక్షణ 

కోట్ల రూపాయలు నేలపాలు 

భద్రాద్రి కొత్తగూడెం మే 30 (విజయ క్రాంతి) నాణ్యతను చూసి ఫక్కున నవ్వేను అ న్నట్లు ఉంది పాల్వంచ మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనుల తీరు. రూ కోట్ల రూపాయలు వెచ్చించి చేపట్టిన అభివృద్ధి పనులు ముచ్చటగా మూన్నాళ్లయిన లేకపోవడం అభివృద్ధి పనుల నాణ్యతలేమి కి నిదర్శనం. ఒకవైపు మంత్రులు, ఎమ్మెల్యే లు నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే త గిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

హె చ్చరికలు కేవలం ఊకే దంపుడు ఉపన్యాసాలకే అంటూ సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నా యి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో డిస్టిక్ మినరల్ డెవలప్మెం ట్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు నాసిరకంగా నిర్మించారు. పట్టణ పరిధిలోని బస్టాండ్ నుంచి భజన మందిరం వరకు గత ఏడాది జులైలో డి ఎం ఎఫ్.టి నిధులు రూ నలభై లక్షలతో చేపట్టి సిసి రోడ్డు నిర్మించా రు.

పట్టుమని పది నెలలకే రోడ్డు గోతుల మయంగా మారింది. పట్టణ పరిధిలోని గు డిపాడులో ఎడ్జస్టింగ్ రోడ్డు నుంచి చెరువు వరకు రూ 50 లక్షలతో గత ఏడాది అక్టో బర్ నెలలో శంకుస్థాపన చే సి హడావుడిగా రోడ్డు నిర్మాణం పూర్తి చేశా రు. వేసిన 6 నెలలకే రోడ్డు పక్కన పగిలి రెం డు ముక్కలుగా మారింది. నాణ్యత ప్రమాణాలు అంటే ఇలానే ఉంటాయా అని ప్రజ లు ప్రశ్నిస్తున్నారు.

నిర్మాణం పనుల్లో నాసిరకం ఇసుకను వినియోగించడం, సక్రమం గా క్యూరింగ్ చేయకపోవడం, సిమెంట్ పా లు తగ్గించటం కారణంగా రోడ్డు అనతి కా లంలోనే శిథిలావస్థకు చేరుతున్నాయి. ము న్సిపల్ ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు మామూళ్ల మత్తులో తూలుతున్నా రని పది కాలాలపాటు ప్రజలకు సౌకర్యం క ల్పించేందుకు ఏర్పాటు చేసే రోడ్లు నాసి రకంగా నిర్మించి అవినీతి అక్రమాలకు పా ల్పడుతున్నారని ఆరోపణలు వెలబడుతున్నాయి.

నియోజకవర్గంలో రూ కోట్ల వ్య యంతో చేపట్టిన పనుల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. జిల్లా కలెక్టర్, క్వాలిటీ కం ట్రోల్ అధికారులు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని, నాసిరకంగా చేసిన కాంట్రాక్టర్లపై, పర్యవేక్షించిన ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజ లు డిమాండ్ చేస్తున్నారు.