21 July, 2026 | 12:34 PM

రీ సర్వే పనులను పకడ్బందీగా పూర్తి చేయాలి

21-07-2026 02:27 AM

జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

మల్లాపూర్, జులై 20(విజయక్రాంతి):ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే పనులను పకడ్బందీగా, వేగవంతంగా పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అన్నారు.సోమవారం మల్లాపూర్ మండలం నడికుడ గ్రామంలో నాన్ కెడస్ట్రాల్ రీసర్వే, ఎంజాయ్ మెంట్ రీ సర్వే పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఇప్పటివరకు ఎంత విస్తీర్ణంలో రీ సర్వే పూర్తయింది, ఇంకా ఎంత మేర చేపట్టాల్సి ఉంది, పనులు ఎన్ని రోజుల్లో పూర్తవుతాయనే వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఆయా గ్రామాల్లో భూమి విస్తీర్ణం ఎంత ఉందని ఆరా తీశారు. సర్వే నంబర్ల వారీగా ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితత్వంతో రీ సర్వే నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.జిల్లాలో మొదటి విడతగా డ్భె గ్రామాల్లో రీ సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు. ప్రస్తుతం ఏడు గ్రామాల్లో ఎంజాయ్మెంట్ రీసర్వే కొనసాగుతుందని పేర్కొన్నారు.నడికుడగ్రామంలో నాన్ కెడస్ట్రాల్ రీ సర్వే చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్ పెల్లి ఆర్డీవో నరసింహ రావు, తహసీల్దార్ రాంచందర్ , సర్వేయర్ కుమారస్వామి, సర్పంచ్, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.