calender_icon.png 25 December, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసలు జలద్రోహి సీఎం రేవంతే!

25-12-2025 01:53:13 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాం తి): పాలమూరు--రంగారెడ్డి ప్రాజెక్టు గొంతుకోసి, సొంత జిల్లాకే దగా చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డే అసలు జలద్రోహి అని, తన నిర్వాకం బయటపడటంతో నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారని,  దగుల్బాజీ కూతలు కూస్తున్నా రని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అహంకారపూరిత, నీచమైన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా బుధవారం తీవ్రస్థాయిలో కేటీఆర్ విరుచుకుపడ్డారు. రాష్ట్ర జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మ అని సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.

నీటి హక్కులపై రాజీపడ్డ విషయాన్ని బయటపెడితే సమాధానం చెప్పలేక చిల్లర డైలాగులతో చిందు లు తొక్కడం రేవంత్ నైజమని విమర్శించారు. తెలంగాణ సోయిలేని, రాష్ట్ర ప్రయోజనాలను రక్షిం చలేని కోవర్ట్ బతుకు రేవంత్‌రెడ్డిదని ఎద్దేవా చేశారు.  ‘పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిపోయిన ఓటుకు నోటు దొంగవని, అదే నీ స్థాయి’ అంటూ రేవంత్‌రెడ్డి గతాన్ని గుర్తు చేశారు.

పనికిమాలిన శపథాలు చేయడం, తీరా సమయం వచ్చాక పత్తా లేకుండా పారిపోవడం రేవంత్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. రాబోయే శాసనసభ, జనసభలోనూకాంగ్రెస్ చేస్తున్న జలద్రోహాన్ని ఎండగడతామని  స్ప ష్టం చేశారు. సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను తొక్కి నారతీస్తారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని బొంద పెట్టడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు. మరో వందేళ్ల దాకా పుట్టగతులు లేకుండా కాంగ్రెస్‌ను పాతిపెట్టడం తథ్యమని హెచ్చరించారు.