calender_icon.png 25 December, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యయ నివేదకల లెక్క చెప్పాల్సిందే..

25-12-2025 01:43:07 AM

  1. జిల్లా బరిలో నిలిచిన సర్పంచ్, వార్డు అభ్యర్థులు 45 రోజుల్లోపు వివరాలు ఇవ్వాల్సిందే..
  2. సమర్పించకుంటే మూడేళ్లు పోటీకి అనర్హులు
  3. గెలిచిన వారి పదవికి గండం

మహేశ్వరం, డిసెంబర్ 24( విజయక్రాంతి ):స్థానిక పోరు లో బరి లో నిలిచిన  అభ్యర్థులు ఎన్నికల నియమావలి ప్రకారం తాము ఎన్నికలో ఎంత ఖర్చు చేశారో 45 రోజుల్లోగా మండలం లో ని సంబంధిత అధికారులకు వ్యయ నివేదకలు సమర్పించాలి. ఒక వేల నిబంధనలు లైట్ గా తీసుకుంటే మాత్రం వారి పై  వారిపై వేటు పడే ప్రమాదం పొంచి ఉంది.

ఎన్నికల్లో పోటీచేసిన అభ్య ర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయించిన రోజు( అంటే అధికారిక ప్రచారం) నుంచి ఎన్నికల ఫలితాలు వెల్లడించే వరకు  వారు చేసిన ఖర్చు వివరాలు  ఎంపీడీవోలకు అందజేయాలి.జిల్లా లో ని 21 మండలలో 525 మంది సర్పంచ్ లు, 4,668 వార్డు సభ్యుల తో పాటు బరి లో  ఉన్న వారంతా 45 రోజుల్లోగా తమ ఖర్చుల  వివరాలు ఎంపీడీవోలకు సమర్పించాలి.

ఎన్నికల నిబంధనల ప్రకారం..

పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచిన రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని నియమ నిబంధనలను విధించింది. దాని ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం 5వేలు అంతకన్న ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థికి రూ.2.50లక్షలు, వార్డుసభ్యులు రూ.50వేల లోపు ఖర్చు చేయాలి. 5వేల కన్న తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.1.50లక్షలు, వార్డు సభ్యులు రూ.30వేలు లోపు ఖర్చు చేయాలి.

ఈ లెక్కలను నిర్దేశిత సమయంలోగా సమర్పించక పోతే మూడేళ్లు ఏ ఎన్నికల్లోనూ పోటీచేయకుండా అనర్హులుగా ప్రకటిస్తారు. ఒక వేళ అభ్యర్థి సదరు ఎన్నికల్లో గెలిచి.. నిర్ణీత సమయంలోగా వివరాలు ఇవ్వకుంటే పదవిని కోల్పోయినట్లు ప్రకటిస్తారు. అయితే గెలుపొందిన సర్పంచ్లకు నెలకు గౌరవ వేతనం కింద ప్రభుత్వం రూ.6,500 చెలిస్తుంది.

నిర్ణీత గడువులోగా వివరాలు అందజేయాలి

మండలంలోని పంచాయతీ ఎన్నిక లో బరిలో నిలిచిన సర్పంచులు, వార్డుసభ్యులుగా పొటీ చేసిన వారు 45 రోజుల్లోగా వివరాలు అందజేయాలి. లెక్కల సమర్పణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీచేసే అర్హతను కోల్పోతారు. గెలిచిన అభ్యర్థులైతే పదవి కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

 సరితా, ఎంపీడీవో, కందుకూరు మండలం