25 July, 2026 | 2:28 AM

సర్ నమోదు ప్రక్రియ వేగవంతంగా చేయాలి

25-07-2026 01:12 AM

కలెక్టర్ ప్రతిమాసింగ్ 

మెదక్, జులై 24 (విజయక్రాంతి): ఎస్.ఐ.ఆర్ నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్.ఐ.ఆర్ నమోదుపై మెదక్ నియోజకవర్గ స్థాయి తాసిల్దారులు, సూపర్వైజర్లు, బిఎల్‌ఓ లతో కలెక్టర్  సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  మండలాల వారీగా ఎస్.ఐ.ఆర్ నమోదు పై సూపర్వైజర్లు , బి ఎల్ వో లు. క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేయాలని వారికి ఇచ్చిన బాధ్యతను   సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ దాదాపు 97% శాతం వరకు పూర్తయిందని, మిగిలిన మొత్తాన్ని నిర్ణీత గడువు కంటే ముందుగానే పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు.

మెదక్ -96 %పాపన్నపేట,- 95% శంకరంపేట- ,100% రామాయంపేట-97 ,% హవేలీ ఘనపూర్,- 98% నిజాంపేట,96%  నా ర్సింగ్ -99 % మండలాల్లో  శాతం  పూర్తికాగా, ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. బీఎల్వోల నుంచి ప్రతిరోజూ పురోగతి నివేదికలు సేకరించాలని, ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించాలని, బీఎల్‌ఏలు కౌన్సిలర్లను సమన్వయం చేసుకుంటూ ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. అదనపు కలెక్టర్ నగేష్ ఆర్డిఓ రమాదేవి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు గఫార్,  మెదక్ డివిజన్  మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.