29 April, 2026 | 3:26 AM

రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్

29-04-2026 12:43 AM

సుల్తానాబాద్, ఏప్రిల్ 28 (విజయ క్రాంతి): రైతుల సంక్షేమమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ పెద్దపీట వేస్తుందని సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు అన్నారు, మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు

ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని రైతన్నలకు అండగా నిలుస్తున్నారని, వారి సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు, పంటల మార్పిడీపై రైతులు దృష్టి సారించాలని అన్నారు. చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నారాయణపూర్, కోదురుపాక, దేవునిపల్లి, చిన్నకల్వల, రెబ్బల్లేపల్లి, పెరిక పల్లి, మియాపూర్, చిన్నబొంకూర్ తదితర గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రకాష్ రావు ప్రారంభించారు.

దళారులను నమ్మి మోసపోవద్దని, మ్యాచర్ వచ్చేవరకు కల్లాల వద్ద ఆరబెట్టి సెంటర్ కు ధాన్యాన్ని తరలించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ అంతటి పుష్పలత , సంఘ ఇన్చార్జి మహమ్మద్ ముఫాసిర్ అహ్మద్, అసిస్టెంట్ రిజిస్టర్ వెంకటేశ్వర్లు, మాజీ సింగిల్ విండో చైర్మన్లు దేవరనేని మోహన్ రావు, శ్రీగిరి శ్రీనివాస్, సీఈవో వల్లకొండ రమేష్, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, నాయకులు, రైతులు, హమాలీలు, సంఘ సభ్యులు , సంఘ సిబ్బంది, సెంటర్ ఇన్చార్జులు,తదితరులు పాల్గొన్నారు.