29 April, 2026 | 3:25 AM

ఎకర భూమి డబుల్ రిజిస్ట్రేషన్

29-04-2026 12:44 AM

బాధిత మహిళ మండ్ల వేంకటమ్మ జడ్చర్ల 

ఎంఆర్‌ఓ నర్సింగ్ రావుకు ఫిర్యాదు

జడ్చర్ల, ఏప్రిల్ 28: మండలం గంగాపూరం గ్రామ శివారులో సర్వే నెంబర్ నెంబర్ 888/రూ లో తనకు చెందిన 20 గుంటల మరో సర్వే నెంబర్ 888/లూ, లో మరో 20 గుంటలు భూమి మొత్తం 1 ఎకరం భూమిని బోగస్ డాక్యుమెంట్లతో డబుల్ రిజిస్ట్రేషన్ చేశారంటూ జడ్చర్ల మండలం శిఖర్ గాని పల్లి గ్రామానికి చెందిన (63) ఏళ్ల వమహిళా మండ్ల వెంకటమ్మ జడ్చర్ల ఎంఆర్‌ఓ కు సోమవారం ఫిర్యాదు చేశారు. 6328/2006, 8595/06 నంబర్ల డాక్యుమెంట్లను రద్దు చేయాలని కోరారు.

ఫిర్యాదులో ఆమె పేర్కొన్న వివరాల ప్రకారం,తాను భూమి అమ్మినట్లు రెండు వేర్వేరు పేర్లతో రిజిస్టర్ డాక్యుమెంట్లు సృష్టించారు. పై తెలిపిన డాక్యుమెంట్ నెంబర్ ల ద్వారా ఇద్దరు వ్యక్తుల పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్లు తెలిసిందని తాను మోసం పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.డబుల్ రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు.ఒకే భూమిని రెండుసార్లు వేరేవాళ్లకు అమ్మినట్లు కాగితాలు సృష్టించి మోసం చేశారని, తన భూమిని అక్రమంగా ఇతరుల పేరు మీద రిజిస్టర్ చేశారని వాపోయారు. పైన పేర్కొన్న బోగస్ డాక్యుమెంట్లను రద్దు చేసి తనకు న్యాయం చేయాలని జడ్చర్ల ఎంఆర్‌ఓ నర్సింగ్ రావు ను కోరారు.