దళిత క్రైస్తవుల హక్కుల కాపాడాలి
అర్మూర్, జూన్ 18 (విజయక్రాంతి): దళిత క్రైస్తవుల హక్కులను కాపాడాలని దళిత క్రైస్తవ ఆర్మూర్ నియోజకవర్గ దళిత క్రైస్తవ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.విలియం కోరారు. గురువారం సబ్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో ఉంచాలని కోరారు. తమను బీసీసీలో చేర్చడం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోయారు.
ఏ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఏవో మహేష్ కు వినతిపత్రం అందజేశారు. అర్మూర్ ఏసీపీతో పాటు అర్మూర్ నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులకు సైతం వినతిపత్రం సమార్పిచి సన్మానించారు. ఈ కార్యక్రమంలో దళిత క్రైస్తవ పాస్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యస్.మార్కు, కోశాధికారి యు.దయసాగర్, ఉపాధ్యక్షుడు బి.ప్రసాద్, గౌరవ అధ్యక్షుడు యం.ఇమ్మానియేల్, సలహాదారుడు పి.డేవిడ్ రాజ్, కమిటీ సభ్యుడు బి.డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.






