10 May, 2026 | 12:15 AM

Breaking News

కరీంనగర్ బంద్ ప్రశాంతం   •   దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •  

పెద్దవాగులోకి వెళ్లే నాలా కబ్జా

14-03-2025 12:04 AM
  1. ప్రభుత్వ భూముల్లో నుంచి ఎర్రమట్టి తీసుకెళ్లి నాలా మూసివేత 
  2. నాలా పూర్తిగా మూసివేసి పొలం పనులు
  3. శ్రీరిధి హాబీట్రేడ్స్ ఎల్.ఎల్.పి రఘునాథ్ డెవలపర్స్ లో అక్రమాలు

కొండాపూర్ మార్చి 13 : కొండాపూర్ మండలం మనసాన్పల్లి గ్రామానికి గిఫ్ట్ గా194,196,16 చేసిన సర్వే నెంబర్ లో వున్నా భూమిని, పెద్ద నాలా ను పూర్తిగా మూసివేసి కబ్జా చేసిన వెంచర్ యజమానులు. రాత్రి సమయంలో మనిదేవునిపల్లి ప్రభుత్వ భూమి 92 సర్వే నెంబర్లు నుండి రాత్రిపూట జెసిబి టిప్పర్ ల సహాయం తో పెద్ద నాలా ను పూడ్చారు.మండలం లో మన్సాన్పల్లి గ్రామం అంటే రోజురోజుకు భూ అక్రమాలకు అడ్డాగా మారుతుంది.

వివరాల్లోకెళ్తే మననంవల్లి గ్రామ సర్వేనెంబర్ 196,194,16, లో హైదరాబాద్ కు చెందిన బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొండాపూర్ రెవెన్యూ ముని దేవునిపల్లి, మనసా నల్లి, లక్ష్మారెడ్డి గూడెం, గ్రామాల రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి శ్రీ రిధి హాబీట్రేడ్స్ ఎల్.ఎల్.పి రఘునాథ్ డెవలవర్స్ పేరుతో నాలా కన్వర్షన్స్ చేసుకొని పెద్దపెద్ద వాగులను  చిన్నగా సుమారు రెండు ఎకరాల పొడవు నాలాను పూర్తిగా మూశారు.తమ వెంచర్ కు అనుకూలంగా నాలాలపై అద్భుతమైన రోడ్లు ఏర్పాటు చేశారు.