1 June, 2026 | 2:46 AM

ఓట్లు గల్లంతు కాకుండా చూడటంలో బీఎల్‌ఓల పాత్ర కీలకం

01-06-2026 01:11 AM
  1. ఎంపీ గడ్డం వంశీకృష్ణ...
  2. కేంద్రం ఎస్.ఐ.ఆర్ పేరుతో విపక్ష ఓట్ల గొలగింపు అడ్డుకోవాలి

ఆదిలాబాద్, మే 31 (విజయక్రాంతి) :  ఎస్.ఐ.ఆర్ ముసుగులో ఎలక్షన్ కమీషన్ అండతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాల అనుకూల ఓట్లను తొలగించేలా కు ట్ర పన్నిందని, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఈవిధంగానే అధికారం దక్కించుకుందని ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏ-2 ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యా రు.

ఈ సందర్భంగా బీఎల్‌ఏ లనుద్దేశించి ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.... తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో తక్కువ మెజారిటీ తో పరాభవం చెందడానికి ఎస్.ఐ.ఆర్ కారణమన్నారు. ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష పార్టీ ల అనుకూల ఓట్లను ఏరివేత తోనే వారు ఓటమిచెందారన్నారు. ప్రధాన మంత్రి మో డీ ప్రజలకు ఇంధనం పొదుపు చేయాలని తెలుపుతూ భారీ కాన్వాయిలు వేసుకొని తిరుగుతన్నారని విమానాల ద్వారా ప్రపం చం పర్యటన చేస్తూ మెలోడీ చాక్లెట్లు పంచుతున్నారని ఎద్దేవా చేశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుండి దేశంలో  ప్రజాస్వామ్య రక్షణ కోసం అంబేద్కర్ ఇచ్చిన ఓ టు హక్కును కాపాడడం కోసం కాంగ్రెస్ కా ర్యకర్తలు పోరాడాలని పిలుపునిచ్చారు. ఎన్నికలేవైనా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కా ర్యకర్తలు పని చేయాలని సూచించారు. బీజే పీ ఎస్‌ఐఆర్ తో తమకు అనుకూలం కాని ఓట్లు ఏరివేసే పని చేస్తుందనితమ బూత్ లలో ఓట్ల తొలగింపు జరగకుండా బీఎల్వోలు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ..

ఓట్ల తొలగింపు విషయాలు ఎట్టిపరిస్థితు ల్లో నిర్లక్ష్యం పనికి రాదన్నారు. బీజేపీ చేస్తు న్న రైతు భరోసా యాత్ర దండుపాళ్యం యా త్రగా విమర్శించారు. రైతులను మాయ మా టలతో తప్పుదో పట్టిస్తున్నారని అన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం వల్లే  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు.  ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షు డు నరేష్ జాదవ్, అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ నివాస రెడ్డి, నియోజకవర్గ అబ్జర్వర్లు రమేష్, అబ్దుల్లా కొత్వాల్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, బోథ్ అసెంబ్లీ ఇంచార్జి ఆడె గజేందర్, ఆదిలాబాద్, బోథ్, జైనథ్ మా ర్కెట్ కమిటీ చైర్మన్లు బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మల్లెపూల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.