25 April, 2026 | 3:37 AM

ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమైనదే

25-04-2026 01:10 AM

సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెలికంటి సత్యం

సూర్యాపేట, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : ఆర్టీసీ కార్మికుల చేపట్టిన సమ్మె న్యాయబద్ధమైనదని ప్రభుత్వం వెంటనే స్పందించి వారి న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంలు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో ముందు జరుగుతున్న మూడో రోజు సమ్మెలో వారు పాల్గొని సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సహనం కోల్పోవద్దని తీవ్ర చర్యలకు పాల్పడవద్దని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఆర్టీసీ కార్మికులు చేసిన కృషి గుర్తుంచుకోవాలన్నారు పిఆర్సి చట్టబద్ధంగా అమలు చేసే అంశం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ప్రభుత్వానికి ఉండబోవన్నారు. గత ప్రభుత్వం హయాంలో రద్దు చేసిన గుర్తింపు యూనియన్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు వాటిని పునరుద్దిస్తామని హామీ ఇచ్చిందని దానిని మర్చిపోవద్దన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే వారికి సిపిఐ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గురువారం నర్సంపేట డిపో వద్ద శంకర్ గౌడ్ అనే కార్మికుడు నిప్పంటించుకుని 80 శాతం కాలి చనిపోయిన కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

నల్లగొండ, భద్రాచలం ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యయత్నం చేశారనిప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావని కార్మికుల సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులతో తగువు పెట్టుకుంటే పతనం తప్పదని యూనియన్ అంటే పాలకులకు భయమెందుకు అన్నారు. డిమాండ్లను పరిష్కరించే వరకు ఆర్టీసీ కార్మికులకుఅండగా ఉంటామని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బోరా వెంకటేశ్వర్లు ఆర్టీసీకార్మికులు పాల్గొన్నారు.