రైతు నేస్తం కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలి
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురుజా రామచంద్రం
మునుగోడు,జూన్ 17( విజయ క్రాంతి): రైతు నేస్తం కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిం చి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురజా రామచంద్రం అన్నారు. మంగళవారం మండలంలోని కొంపెల్లి గ్రామంలో సిపిఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో జెండాను ఎగురవేసి మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అవగాహన సదస్సులు రైతు నేస్తం అనే కార్యక్రమాన్ని రైతు వేదికలలో ఒక్కరోజు అవగాహనతో సరిపెట్టకుండా వ్యవసాయ అధికారులు గ్రామాల వారీగా రైతులకు సలహాలు సూచనలు ఇస్తూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారదులు అధికారులు ఉండాలని అన్నారు.
రైతులకు పెట్టుబడి సాయం రుణ మాఫీ సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, జిల్లా కౌన్సిల్ మెంబర్స్ బి లాలు,ఎస్ చలపతి,మండల కార్యవర్గ సభ్యులు ఈ కైలాస్,ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి బి శంకర్, కట్ట దశరథ ,వెంకటేశ్వరరావు మోగుదాల యాదయ్య,పులకరం ఆంజనేయులు,గ్రామ శాఖ సభ్యులు ఉన్నారు.




