పోలీస్ అమరుల త్యాగాలు వెలకట్టలేనివి..
పాపన్నపేట (విజయక్రాంతి): పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ స్టేషన్ లోని అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1999 సెప్టెంబర్ 13న పాపన్నపేట పోలీస్ స్టేషన్ ను మావోయిస్టులు పేల్చివేయడం చాలా బాధాకరమన్నారు.
ఈ ఘటనలో అమరులైన పోలీసులు హెడ్ కానిస్టేబుల్ రఘునందన్, కానిస్టేబుళ్లు అబేద్ హుస్సేన్, రాంచందర్, ప్రసాద్, నర్సింలు చిత్రపటాలకు నివాళులు అర్పించారు. వీరితో పాటు వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ వివిధ ఘటనల్లో అమరులైన పోలీసులను ఎప్పటికీ మరువబోమన్నారు. పోలీసులు పగలు, రాత్రి అనే తేడా లేకుండా శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. ఏఎస్సై తుక్కయ్య, కానిస్టేబుళ్లు శివకుమార్, నర్సింలు, వెంకటేష్, యాదగిరి, నాగలక్ష్మీ, తదితరులున్నారు.






