21-10-2025 05:22:45 PM
లక్షేట్టిపేట (విజయక్రాంతి): దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ఊత్కూర్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు ప్రతి షాపుకు వెళ్లి వ్యాపారస్తులకు బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ రావులు సోమవారం సాయంత్రం వ్యాపారస్తులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్లు తిప్పని లింగయ్య. కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచుచిన్నయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పాడేటి శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, నాయకులు అంకతి గంగాధర్, పెట్టెం తిరుపతి, మైనార్టీ నాయకులు షేక్ చాంద్ ఓడగంటి శ్రీకాంత్, మెట్టు రాజు, పాల్గొన్నారు.