21-10-2025 05:25:42 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో స్వర్గీయ గర్రెపల్లి పురుషోత్తం రావు మాజీ సర్పంచి 31వ వర్ధంతి సందర్భంగా మంగళవారం గర్రెపల్లిలోని ప్రాథమిక దవాఖానాలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం రావు అభిమానులు కన్న కొమురయ్య గౌడ్, బొల్లం లక్ష్మణ్, మాజీ సర్పంచి రవీందర్ రావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ దీకొండ శ్రీనివాస్ పలువురు ఉన్నారు.