10 June, 2026 | 3:35 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

భద్రాచలంలో ఏప్రిల్ 7, 8, 9లలో సమ్మక్క సారక్క జాతర

30-03-2026 02:00 AM

జాతర పనులను ప్రారంభించిన భద్రాచలం సర్పంచ్ పూణే కృష్ణ 

భద్రాచలం, మార్చి 29, (విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలోని అల్లూరి సీతారామరాజు కాలనీలో ఏప్రిల్ 7, 8, 9 తేదీలలో నిర్వహించబడనున్న ఆదివాసీ ఆరాధ్య దైవాలు శ్రీ సమ్మక్కసారలమ్మ జాతర  సందర్భంగా ఆదివారం జాతర పనులను ప్రారంభించారు. గద్దెల వద్ద పందిరి ముహూర్తం కార్యక్రమం ఉదయం 11 గంటలకు ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని భద్రాచలం సర్పంచ్ శ్రీ పూనెం కృష్ణ  ప్రారంభించారు.

ఈ సందర్భంగా జాతర నిర్వాహకులు మరియు కుల పెద్దలు ఆదివాసీ ప్రజా ప్రతినిధులైన సర్పంచ్ శ పూనెం కృష్ణ తో పాటు 10వ వార్డు సభ్యులు శ్రీ నిట్టా రాజు, 12వ వార్డు సభ్యులు శ్రీ కారం దుర్గారావు, 15వ వార్డు సభ్యురాలు శ్రీమతి సున్నం ఈశ్వరమ్మ, 18వ వార్డు సభ్యురాలు శ్రీమతి జగ్గా కుమారి, 20వ వార్డు సభ్యురాలు శ్రీమతి ఇర్పా అనసూయ లను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమానికి అతిథులుగా కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, రామకృష్ణ, బీజేపీ నాయకులు అల్లాడి వెంకటేశ్వరావు, బోడ సత్యనారాయణ, అల్లాడి వెంకట సుబ్బయ్య, చెల్లుబోయిన వెంకన్న, సత్తి పండు, అలాగే సిపిఎం నాయకులు కుంజా శ్రీను తదితరులు హాజరయ్యారు. గత 16 సంవత్సరాలుగా భద్రాచలం పట్టణంలో ఘనంగా నిర్వహిస్తున్న ఈ అమ్మవార్ల జాతరను ఈసారి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జాతర నిర్వాహకులు కుంజా ధర్మా, కుంజా సంతోష్, కుంజా అంజలి, కోర్సా చినబాబు దొర, కోర్సా దుర్గ, సున్నం పల్లవి, సవలం వంశీ, సవలం రాధ, కణితి నవీన్, కణితి నాగమణి, దేవర బాల గుండోజి రాజీ, కోయకుల పటేల్ కోడి రాంబాబు, కుల పెద్దలు వీరమల్లు సత్యనారాయణ, ఉమ, సోడి సావిత్రి, రాములు, రుక్మిణి, మిడియం మోహన్, లక్ష్మికాంత, కోర్సా నాగరాజు, సంగీత, మర్మం గోపీ, కళ్యాణి, సోడి శివ, సరిత తదితరులు కోరారు.