30 March, 2026 | 4:14 AM

మహిళల సాధికారత,ఆర్థికాభివృద్ధిపై పాలకులు దృష్టి పెట్టాలి

30-03-2026 01:59 AM

కొత్తపల్లి, మార్చి 29(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవ న్ లో భారత జాతీయ మహిళా సమాఖ్య జి ల్లా జనరల్ బాడీ సమావేశం ఆదివారం రోజున జిల్లా సహాయ కార్యదర్శి కొట్టె అంజ లి అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా గూడెం లక్ష్మీ హాజరై మాట్లాడుతూ సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు పెరుగుతున్న తరుణం లో కూడా మహిళల పట్ల వివక్షత పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజ్యాం గంలో మహిళలకు కల్పించిన హక్కులు, చట్టాలు నిస్పక్ష పాతంగా పాలకులు అమలు చేయాలని,మహిళలలను అన్ని రంగాల్లో ఆర్థికంగా,సామాజికంగా,రాజకీయంగా అభివృద్ధి చేయడానికి పాలక ప్రభుత్వాలు ప్రో త్సహించాలని, ఎప్పటికప్పుడు మహిళల్లో ధైర్యాన్ని కల్పించాలని, మహిళలకు కల్పించిన రిజర్వేషన్ల ను అమలు చేయాలని, వారికి ప్రాధాన్యత కల్పించి మహిళల్లో మనోధైర్యాన్ని నింపాలన్నారు.

మహిళలు అధికారిక పదవుల్లో ఉన్నప్పటికీ పురుషుల పెత్తనం కొనసాగుతుందని దాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని, సమాజంలో నేటికి మహిళలపై అత్యాచారాలు,హత్యలు  రోజు రోజుకు పెరిగిపోతున్నాయని వాటిని  నియంత్రించడానికి చట్టాలను పకడ్బందీగా అమలు చేసి బాధిత మహిళలకు న్యాయం చేయాలని,సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు వేగవంతం అవుతున్న తరుణంలో కూడా వరకట్న వేధింపులు జరగడం దారుణమని, అత్యాచారాలకు గానీ, వేధింపులకు గానీ ఎవరైనా పాల్పడితే  మహిళలు ధైర్యంగా  ప్రతిఘటించాలని గూడెం లక్ష్మీ పిలుపునిచ్చారు. 

ఈ సమావేశంలో భారత జాతీయ మహిళా సమాఖ్య ఎన్.ఎఫ్.ఐ. డబ్ల్యుజిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి బీర్ల పద్మ, జిల్లా సహాయ కార్యదర్శి కొట్టె అంజలి,నాయకురాళ్లు నక్క కేతవ్వ ఎలిశెట్టి భారతి,కందుకూరి సావిత్రి,రాగుల రేణుక, ర్యాకం మల్లిక, కాట్నపల్లి అఖిల,జీ. వాణి, ఎన్.శాంత,స్వప్న,సుజాత,గుమ్మడిసుజాత,రజిత మరియు సావిత్రి  పాల్గొన్నారు.