09-12-2025 01:05:22 AM
సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
చండూరు, డిసెంబర్ 8(విజయ క్రాంతి): చండూరు మండల పరిధిలోనినేర్మట గ్రామంలో బి ఆర్‌ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నారాపాక వసంత ధనయ్య ను, వీరితోపాటు వార్డు మెంబర్ కు నామినేషన్ వేసిన వార్డ్ మెంబర్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. సోమవారం చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో ఇంటింటి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్పంచ్ అభ్యర్థినారపాక వసంత ధనయ్యను గెలిపిస్తే మీ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతారని ఆయన అన్నారు. ఒక్కసారి వారికి అవకాశం ఇస్తే గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తారని ఆయన అన్నారు. జరగబోయే ఎన్నికలలో పర్సు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన గ్రామ ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో నందికొండ నరసింహారెడ్డి,నారపాక శంకరయ్య, ధనంజయ, బండమీది ఎల్లయ్య, బండమీది వెంకటయ్య, నారపాక పెద్ద ఆంజనేయులు, నారపాక ధనయ్య,ఈరటి వెంకటయ్య, బల్లెం స్వామి, నారపాక నరసింహ, నారపాక బిక్షం, బొడిగె నగేష్, లక్ష్మయ్య, బండమీది పరమేష్ తదితరులు పాల్గొన్నారు.