15 March, 2026 | 12:41 AM

నాలుగు గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవం

04-12-2025 12:00 AM

బూర్గంపాడు,డిసెంబర్ 3,(విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూ ర్గంపాడు మండలంలోని మోరంపల్లి బంజర్, లక్ష్మీపురం, పినపాక పట్టి నగర్ గ్రామాల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మో రంపల్లి బంజర్‌లో బొర్రా సుభద్ర,ధనసరి నళిని,కొట్టా విశ్వనాధ్ సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వేశారు. బుధవారం నళిని, వి శ్వనాధ్ తమ నామినేషన్ పత్రాలు ఉపసంహరించుకోగా బొర్రా సుభద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

12వార్డుల్లో ఒక్క స్థానం ఏకగ్రీవం కాగా 11 స్థానాల్లో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. లక్ష్మీపురంలో బాదం వెంకటేష్ రె డ్డి ఒక్కరే సర్పంచ్ స్థానానికి నామినేషన్ వే యడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.10వా ర్డు స్థానాలకు 10 వార్డులు ఏకగ్రీవం కావడంతో ఉప సర్పంచ్ గా పున్నారెడ్డిని ఎన్ను కున్నారు.పినపాక పట్టి నగర్ లో బానోత్ పద్మ,నూనవత్ శిరీష,రాము, శ్రీను,నరేష్ స ర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వేశారు.

శిరీ ష, రాము, శ్రీను,నరేష్ తమ నామినేషన్ ప త్రాలను ఉపసంహరించుకోవడంతో బానో త్ పద్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 10 వార్డు స్థానాల్లో 7వార్డులు ఏకగ్రీవం కావడంతో మూడు వార్డులలో అభ్యర్థులు పోటీ లో ఉన్నారు. కృష్ణ సాగర్ లో తాటి వాణి, కమల బాయియి సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వేశారు.

కమల బాయి తన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోవడంతో తాటి వాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు.10 వార్డు స్థానాలకు 9 వార్డులు ఏకగ్రీవం కావడంతో ఉప సర్పంచ్ గా మోహన్ ను ఎన్ను కున్నారు.ఒక్క వార్డులో మాత్రమే అభ్యర్థులు పోటీలో ఉన్నారు.నాలుగు గ్రామాల్లో అన్ని పార్టీల నాయకులు,గ్రామస్థులు ఏకగ్రీవానికి కృషి చేసి ఐక్యతను చాటుకున్నారు.