హైదరాబాద్@సేఫరాబాద్
సర్వేజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ కార్యక్రమం
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 3 (విజయక్రాంతి): సర్వేజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ను సేఫరాబాద్ మార్చాలనే లక్ష్యంతో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న సప్త పాపాలను అరికట్టేందుకు యమలోకం నుంచి నేరుగా యమధర్మరాజును రంగంలోకి దింపారు. యమలోకంలో అకాల మరణాల వల్ల సరైన సదుపాయాలు కల్పించలేకపోతున్నందుకు అకాల మరణాలను అపాలనే తీవ్రమైన ఆకాంక్షతో హైదరాబాద్‌లోని ప్రతి జంక్షన్‌లో ఒక రోజు ప్రత్యక్షమై హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకోని వారికి తగిన బోధన చేసి, అకాల మరణాలను ఆపాలనే కృతనిక్షయంతో భూలోకానికి వచ్చిన యమధర్మరాజు బుధవారం సర్వేజనా ఫౌం డేషన్ ఆధ్వర్యంలో రసూల్పరా జంక్షన్లో ఏర్పాటుచేసిన అవగాహ కార్యక్రమంలో పాల్గొన్నారని ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎ.వి. గురవారెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమం నగరంలోని 365 ప్రధాన జంక్షన్లు ఎంచుకొని సంవత్సరం పాటు రహదారి భద్రతను ఒక దీక్షతో కొనసాగించి, అకాల మరణాలను తగ్గించి హైదరాబాద్‌ను సేఫరాబాద్ మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రపంచంలో ఉన్న వాహనాలతో పోలిస్తే ఇండియాలో ఒక శాతం మాత్రమే కాని ప్రపంచంలో జరిగే రోడ్డు యాక్సిడెంట్లలో మరణిస్తున్న మరణాల్లో మన దేశం వాటా 16 శాతం ఉండటం బాధపడాల్సిన విషయమని డాక్టర్ గురవారెడ్డి తెలిపారు.
అమెరికాలో మన దేశం కంటే నాలుగు రెట్లు ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నా. ఇండియాలో నాలుగు రెట్లు ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని ఇం దుకు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం కారణమని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటి స్తూ డ్రైవ్ చేస్తే 60 శాతం మరణాలను అడ్డుకోవచ్చని తెలియజేయడంతో పాటు అంద రిలో అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో సర్వేజనా ఫౌండేషన్ సీఈఓ రిటైర్డ్ ఐఎఎస్, డాక్టర్ బి. జనార్ధన్ రెడ్డి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సర్వేజనా ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలను తెలిపారు. అనంతరం రసూల్పురా జంక్షన్ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సికింద్రాబాద్ జీహెచ్‌ఎంసి జోనల్ కమీషనర్ రవికిరణ్, నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు, సర్వేజనా ఫౌండేషన్ సభ్యులు వంశీ మోదుగుల, రాం మంజీరి పాల్గొన్నారు. యమధర్మరాజు వేషధారణలో అర్జున్ రావు యమపాశంతో సప్తపాలపై అవగాహన కల్పించారు.




