15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

స్కాలర్ షిప్ బకాయిలు చెల్లించాలి

08-02-2026 01:55 AM
  1. పెండింగ్‌లో ఉన్న రూ.8,500 కోట్లను విడుదల చేయాలి
  2. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య

ఎల్బీనగర్, ఫిబ్రవరి 7 : పెండింగ్లో ఉన్న రూ.8,500 కోట్ల స్కాలర్ షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం, బీసీ విద్యార్థి సంఘా ల ఆధ్వర్యంలో శనివారం చంపాపేటలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ... ఎన్నో పోరాటాలతో సాధించుకున్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చాలని కుట్ర లు చేస్తున్నదన్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యకు ఉపయోగపడుతున్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ పథకం నిధులు మూ డు సంవత్సరాలుగా విడుదల కాకపోవడం తో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు తెలిపారు. ఫీజు చెల్లించే వరకు కళా శాలల్లో సర్టిఫికెట్లు పొందలేక ఉద్యోగాలు, ఉన్నత విద్య, విదేశీ అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పది రోజు ల్లో పెండింగ్ స్కాలర్ షిప్స్ విడుదల చేయకపోతే రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రుల ఇండ్ల ముట్టడి తప్పదని ఆయన హెచ్చరించారు. విద్య రాజ్యాంగబద్ధమైన హక్కు అని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ నీలా వెంకటేశ్, బీసీ సంఘం నాయకులు శివ కుమార్ యాదవ్, రాజేందర్, విద్యార్థులు పాల్గొన్నారు.