calender_icon.png 8 February, 2026 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెల్లాపూర్‌లో విగ్రహాల జగడం!

08-02-2026 01:53:57 AM

  1. శివాజీ విగ్రహం ఏర్పాటు అనంతరం పది రోజులకే పక్కనే ఫూలే విగ్రహం ఏర్పాటు
  2. ఇరువర్గాల మధ్య వాగ్వాదం.. ఉద్రిక్తత
  3. పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన గొడవ 

పటాన్‌చెరు, ఫిబ్రవరి 7: మహనీయుల విగ్రహాల ఏర్పాటు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ సర్కిల్ వద్ద శివాజీ విగ్రహాన్ని ఓ వర్గంవారు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పది రోజులకే అదే ప్రదేశంలో శివాజీ విగ్రహం పక్కనే జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని మరో వర్గం ఏర్పాటు చేయడంతో మొదటి వర్గం వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఫూలే విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలై తారా స్థాయికి చేరుకుంది. ఒకానొక సమయంలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వర్గం ఫూలే విగ్రహాన్ని కూల్చివేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు.

ఇరు వర్గాల వారు చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలని, నిబంధనలను ఉల్లం ఘించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని హెచ్చరించారు. కాగా విగ్రహాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించిన వ్యక్తులు క్షమాపణ చెప్పాలని ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసినవారు డిమాండ్ చేశారు. పోలీసులు కల్పిం చుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు.