24 April, 2026 | 2:46 AM

బ్యాంక్ కస్టమర్ల భద్రతే ముఖ్యం

24-04-2026 01:27 AM

నగర పోలీస్ కమిషనర్  వీసీ సజ్జనర్

సికింద్రాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): బ్యాంకు అధికారులు కేవలం ఖాతా ల ఓపెనింగ్ టార్గెట్స్ వెంట పడకుండా, కస్టమర్ల భద్రతకు పెద్దపీట వేయాలని హైద రాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ సూ చించారు. ఒక్క కస్టమర్ కూడా సైబర్ నేరా ల బారిన పడకుండా చూడటమే ప్రాథమిక లక్ష్యంగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో గురువారం మ్యూల్ ఖాతా ల నియంత్రణపై బ్యాంకు అధికారులతో హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ సమన్వయం సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో  ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్, అడిషనల్ సీపీ ఎం. శ్రీనివాసులు తో పాటు 45 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన 75 మంది ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లకు సహక రిస్తున్న మ్యూల్ ఖాతాలను అరికట్టేందుకు ‘సేఫ్ కస్టమర్ చాలెంజ్’ను బ్యాంకులు స్వీకరించాలని కోరారు.  ఈ సమావేశంలో సైబ ర్ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ శివమారుతి తో పాటు 45 బ్యాంకులకు చెందిన 75 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.