24 April, 2026 | 3:04 AM

నేడు చర్చలు

24-04-2026 01:28 AM

ఆర్టీసీ సమస్యలపై  మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు

సబ్ కమిటీ అధ్యక్షుడిగా డిప్యూటీ సీఎం భట్టి .. సభ్యులుగా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు 

కార్మికులు ప్రాణాలు తీసుకోవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరి ష్కరించే విషయంలో ప్రభుత్వం వందకు వంద శాతం సానుకూలంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చె ప్పారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేందుకు మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటైందన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన ఈ సబ్ కమిటీలో.. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, జూ పల్లి కృష్ణారావు సభ్యులుగా ఉంటారని తెలిపారు.

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యాయత్నం ఘటనల గురించి తెలిసి సీఎం రేవంత్‌రెడ్డి చలించిపోయారని, అందుకే క్యాబినెట్ మీటింగ్ మధ్యలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. కార్మికులు క్షణికావేశానికి లోనుకాల్సిన అవసరం లేదని.. వారి విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.  గత ప్రభుత్వం ఉద్యో గుల రిటైర్మెంట్ ప్రయోజనాలు రూ. వేల కోట్లు పెండింగ్‌లో పెట్టిందన్నారు.

తమ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలో బెనిఫిట్స్ విడుదల చేయడంలో కొంత ఆల స్యం జరిగినా.. రెండో ఏడాది నుంచి ప్రతి నెల రూ. 700 కోట్ల నుంచి రూ. 800 కోట్ల వరకు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఇంకా రూ. 6,200కోట్లకు పైగా విశ్రాంత ఉద్యోగులకు బెనిఫిట్స్ ప్రభు త్వం ఇవ్వాల్సి ఉందన్నారు. అందుకు 100 రోజులకు సంబంధించి ఒక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి పొంగులేటి వివరించారు.

గురు వారం రాష్ట్ర సచివాలయంలో ఆర్టీసీ సమ్మె, కార్మికుల సమస్యలపై క్యాబినెట్‌లో చర్చించిన అనంతరం మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటిం చాలని, ప్రాణాలు తీసుకోవద్దని, సమ్మె విరమించాలని మంత్రులు కోరారు. ప్రేరేపిత శక్తుల ఒత్తిడికి కార్మికులు బలికావొద్దని, కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చర్చలు జరుపుతుందని తెలిపారు.

సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీ వేశామని, శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జేఏసీ నాయకులతో చర్చలు జరుపుతా మన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై క్యాబినెట్ స్థాయిలో చర్చ జరిగిందని, ఈ క్రమంలోనే కొంత ఆలస్యం అయిందని రవాణాశాఖ మం త్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం  జేఏ సీ నాయకులతో చర్చలు జరుపుతామని ప్రకటించారు. ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో ఉద్యో గాలు తీసివేస్తారనే ప్రచారం సరైంది కాదని, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ...ఆర్టీసీ కార్మికులు తొందరపాటు చర్య లకు పాల్పడవద్దు అని విజ్ఞప్తి చేశారు. ప్రాణాలు తీసుకోవడం అనేది బాధాకరమైన విషయమన్నారు. ఈ ప్రజా పాలన ప్రభుత్వం -ఆర్టీసీ కార్మి కుల ప్రభుత్వమన్నారు. క్షణికావేశంలో అనర్థా లు జరుగుతాయని, ప్రేరేపిత శక్తులకు కార్మికులు బలికావొద్దని హితవు పలికారు. క్షణికా వేశం ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేయొద్దన్నారు. మీ కుటుంబాలకు మీ అండ అవస రమన్నారు.

కేబినెట్ ఎజెండా మొదలు కాకుండానే ఆర్టీసీ కేబినెట్‌లో చర్చించామని తెలిపారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నదన్నారు. ఆర్టీసీ బలోపేతం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామని, ఆర్టీసీ కార్మికులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని, ప్రాణం చాలా విలువైనదని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ ఉద్యమంలో మనం కలిసి కొట్లాడినమని, తెలంగాణ వచ్చాక గత ప్రభుత్వంలో 58 రోజులు సమ్మె చేసి.. 36 మంది మరణించినా నాడు పట్టించుకోలేదన్నారు. కొంత మం ది రాజకీయ లబ్దికోసం రెచ్చగొడతారు..కార్మికులు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆర్టీసీకి  10వేల కోట్లు కాంగ్రెస్ ప్రభు త్వం చెల్లించిందని, తెలంగాణ మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం మీ వల్లే విజయవంతం అయిందన్నారు.

ఆర్టీసీ కార్మికులకు ప్రజా ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఆలోచన చేయాలని, మీకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధ్యతాయుతమైన సీనియర్ మంత్రిగా, తెలంగాణ ఉద్యమకారునిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ...ఆర్టీసీ సమస్యల పరిష్కారానికై ప్రభుత్వానికి శిత్తశుద్ధి ఉందన్నారు.

పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయ త్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్‌ను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. హైదర్‌గూడ అపోలోలో మెరుగైనా చికిత్స అంది స్తామన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆవేశపడొద్దు... చర్చలు జరుపుదామని కోరారు. ఆర్టీసీ కార్మికులు తమ కుటుంబ సభ్యులని, బావోద్వేగాల తో సమస్యలు పరిష్కారం కావని చెప్పారు.

ఆర్టీసీ కార్మికులు తొందరపడొద్దు: సీఎం

ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేకందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో దృష్టి పెట్టిందని సీఎం ప్రకటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క ఆధ్వర్యంలో మంత్రులు ఆర్టీసీ కార్మికులతో శుక్రవారం మాట్లాడుతారని సీఎం పేర్కొన్నారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. 

నల్లగొండలోనూ ఆత్మహత్యాయత్నం

  • అడ్డుకున్న తోటి కార్మికులు

నల్లగొండ, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): నల్లగొండ బస్‌స్టాండ్‌లో ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త వాతావర ణం నెలకొన్నది. ఆర్టీసీ కార్మికులు తమ సమస్యను పరిష్కరించాలని నిరసనకు దిగారు. కార్మికులంతా సమ్మెలో ఉండగా ఆర్టీసీ డ్రైవ ర్ రావుల వెంకన్న తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

దీంతో అప్రమత్తమైన తోటి కార్మికులు అత న్ని అడ్డుకున్నారు. డ్రైవర్ వెంకన్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశా రు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు కీలకంగా వ్యవహరించారని పలువురు పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారంలోనూ వెనకడుగు వేసే ది లేదన్నారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం తీరుతో బలిదానాలకు గురికాక తప్పడం లేద ని ఆవేదన వ్యక్తం చేశారు.

పాలకులు కార్మికులను పావుగా వాడుకుంటున్నారని, సమ స్యలను పరిష్కరించడం లేదన్నారు. డ్రైవర్ వెంకన్నను తోటికార్మికులు ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెలో పాల్గొన్న పలు ప్రజా సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

సంయమనం పాటించండి.. సమ్మె విరమించండి

  1. ప్రేరేపిత శక్తుల ఒత్తిడికి బలికావొద్దు
  2. ఆర్టీసీ కార్మికులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విజ్ఞప్తి

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాం తి): ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటిం చి.. సమ్మె విరమించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తప్పకుండా చర్చలు జరుపుతుందని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొ న్నారు. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, ప్రాణాలు తీసుకునే అనాలోచిత చర్యలకు పాల్పడి, మీ కుటుంబాలకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

క్షణికావేశంతో కొత్త సమస్యలు వస్తాయని, ప్రేరేపిత శక్తుల ఒత్తిడికి బలికావొద్దని కోరారు. కార్మికుల సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వెంటనే చర్చలకు ముందుకు రావాలని కార్మిక సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. కార్మికులు ఆత్మనిబ్బరంతో ఉండాలని.. ప్రభుత్వంతో చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

బస్ కా పయ్య నహీ చలేగా!

  1. హుస్నాబాద్‌లో బస్సులను నడపాలని అధికారుల ప్రయత్నం
  2. అడ్డుకున్న కార్మికులు, బస్సు ముందు పడుకున్న ఉద్యోగి

హుస్నాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాం తి): హుస్నాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట సమ్మె చేస్తున్న కార్మికులు గురువారం ఆగ్రహావేశాలతో రగిలిపోయారు. మధ్యాహ్నం భోజనం చేస్తున్న వేళ, మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న డిపో నుంచి రెండు బస్సులైనా నడపాలనే ఉద్దేశంతో అధికారులు విఫలయత్నం చేశా రు. ఈ క్రమంలో కరీంనగర్ బోర్డు గల బస్సును ప్రైవేట్ డ్రైవర్‌తో బయటకు పం పించేందుకు సిద్ధమయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు భోజనం మధ్యలోనే లేచి పళ్ళాలను పట్టుకుని పరుగెత్తుకుంటూ వచ్చి బస్సుకు అడ్డుగా నిలబడి ఆందోళన చేపట్టారు. ఓ కార్మికుడు ఏకంగా బస్సు టైర్ ముందు అడ్డంగా పడుకోవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. ‘బస్ కా పయ్య నహీ చలేగా’ అంటూ కార్మికులు నినాదాలతో అధికారుల చర్యలపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. బస్సును తిరిగి వెనక్కి తీసుకెళ్లే వరకు కదలమని హెచ్చరించారు.

ప్రభుత్వ వైఖరిపై మండిపడిన ఉద్యోగులు తింటున్న అన్నంలో మన్నుపోశారు అం టూ ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు పరిస్థితి అదుపు తప్పుతుందనే ఆందోళనతో అధికారులు బస్సును వెనక్కి పంపారు. స్థానిక ఏసీపీ సౌడారపు సదానందం ఆధ్వర్యంలో హుస్నాబాద్ సీఐ కె శ్రీనివాస్, ఎస్‌ఐ పాకాల లక్ష్మారెడ్డి శాంతి భద్రతలు అదుపు తప్పకుండా భారీ బందోబస్తు నిర్వహించారు.