calender_icon.png 10 January, 2026 | 8:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మను’ వర్సిటీ భూములు లాక్కోవడం హేయం

07-01-2026 12:53:54 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): ముఖ్యమంత్రికి ఉన్న రియల్ ఎస్టేట్ దురాశను తీర్చడం కోసం విద్యాసంస్థల భూములను కబళించడం అత్యంత హే యమైన చర్య అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. విద్యా సంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభు త్వం, వాటిని నాశనం చేసేలా వ్యవహరించ డం సమర్థనీయం కాదని హితవు పలి కారు.

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి చెందిన 50 ఎక రాల భూమిని లాక్కోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై కేటీఆర్  ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కాం గ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నిలదీస్తూ, తెలంగాణలో మీ ప్రభుత్వం ఏం చేస్తోందో మీకు కనీసం అవగాహన ఉందా అని ప్ర శ్నించారు. విద్య, మైనారిటీల పక్షాన నిలబడతా మని చెప్పే మీ పార్టీ విధానం ఇదేనా అం టూ ఆయన నిప్పులు చెరిగారు.

గతంలో హై దరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పచ్చని అడవిని బుల్డోజర్లతో కూల్చి వేసి, వన్యప్రాణులను పొట్టనబెట్టుకోవడం ద్వా రా మీ సీఎం కాంగ్రెస్‌కి జాతీయ స్థాయిలో తలవంపులు తెచ్చారని కేటీఆర్ గుర్తు చేశా రు.

ఆ అవమానకర ఘటన నుంచి పాఠాలు నేర్చుకోకుండా, ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీని లక్ష్యంగా చేసుకోవడం దారుణమని తెలిపారు. అకడమిక్ బ్లాక్లు, హాస్టళ్లు, భవిష్యత్ కోర్సుల కోసం కేటాయించిన భూ మి ని లాక్కోవడం అంటే వేలాది మంది విద్యార్థుల ఆశయాలను సజీవ దహనం చేయ డ మేనన్నారు. ఈ అన్యాయంపై బీఆర్‌ఎస్  మౌనంగా ఉండబోదని,   విద్యార్థులకు అండగా నిలుస్తామన్నా రు.