17 August, 2026 | 1:30 AM

పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేం..

17-08-2026 12:54 AM

బీజేవైఎం అధ్యక్షులు శశాంక్ సింగ్   

జవహర్ నగర్, ఆగస్టు 16 (విజయక్రాంతి): పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెల కట్టలేమని వారు ప్రకృతికి పర్యావరణానికి రక్షకులని బీజేవైఎం అధ్యక్షులు శశాంక్ సింగ్ పేర్కొన్నారు. జవహర్ నగర్ డివిజన్లో బీజేవైఎం అధ్యక్షులు డివిజన్ బిజెపి అధ్యక్షులు కలికోట కమలాకర్ సమక్షంలో ఆదివారం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు గొడుగులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా శశాంక్ సింగ్ మాట్లాడుతూ కార్మికులకు జీతాలు పెంచాలని ఉద్యోగాలు పెర్మనెంట్ చేయాలని మౌలిక వస్తువులైన గ్లౌజులు, బూట్స్, రైన్ కోట్స్, మాస్కులు తదితర సామాగ్రిని అందజేయాలని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని పెన్షన్స్ సౌకర్యాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు తులసిరాం అమర్ రవి అనిల్ అరుణ్ కుమార్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.