9 May, 2026 | 9:18 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ చేసిన సేవలు చిరస్మరణీయం

09-09-2025 06:04 PM

వేములవాడ ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ పెంచలయ్య..

వేములవాడ టౌన్ (విజయక్రాంతి): జిల్లాలో వేములవాడ తెలంగాణ భాషా పరిరక్షణకు, ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడు కాళోజీ తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు చేసిన సేవలు చిరస్మరణీయం అని డాక్టర్ పెంచలయ్య అన్నారు. కాళోజీ జయంతి వేడుకల సందర్భంగా వేములవాడ ఏరియా హాస్పిటల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగు సాహితీ రంగానికి ప్రజాకవి కాళోజీ చేసిన సేవలు మరువలేనివని, తెలంగాణ ప్రాంతంలోని ఎంతో మంది కవులకు స్ఫూర్తినిచ్చిన దార్శనీకుడు కాళోజీ నారాయణ రావు అని, తెలంగాణ భాషా పరిరక్షణకు కృషి చేయడంతో పాటు తన కవితలతో ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడుగా అభివర్ణించారు. భారత దేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ తో సన్మానింపబడిన ప్రజాకవి కాళోజీ స్ఫూర్తిని ప్రజలు కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏవో నాగరాజు, భాస్కర్, జవీద్, వేణు కుమార్, వంశీకృష్ణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.