calender_icon.png 9 September, 2025 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నాల ఎర్ర చెరువును పరిశీలించిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు

09-09-2025 06:07:16 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం(Bellampalle Mandal)లోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో గల ఎర్రకుంట చెరువును మంగళవారం నీటిపారుదల శాఖ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు పరిశీలించారు. ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్లను కలుపుకొని 14 ఎకరాల భూమి ఎర్రకుంట చెరువు విస్తీర్ణంలో ఉందని నిర్ధారించారు. ఎఫ్ టి ఎల్ లెవెల్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాతిన సిమెంటు ఫోల్లను త్వరలోనే తొలగిస్తామని, చెరువుకు పడిన తాత్కాలిక గండిని పూడ్చేలా పనులు ప్రారంభిస్తామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని తహసిల్దార్ కృష్ణ కోరారు. వారి వెంట బెల్లంపల్లి టిడిపి పట్టణ అధ్యక్షులు మని రామ్ సింగ్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు అంబాల మహేందర్, ఓ పి టి ఆర్ జిల్లా కన్వీనర్ గోగర్ల శంకర్ లు పాల్గొన్నారు.