29 April, 2026 | 2:14 AM

ఎక్కడి నౌకలు అక్కడే !

29-04-2026 12:25 AM
  1. కొనసాగుతున్న అమెరికా దిగ్బంధం
  2. ఇరాన్ ఓడరేవుల్లో నౌకలు బందీ
  3. హోర్ముజ్ వద్ద కూడా ఇదే పరిస్థితి

టెహ్రాన్, ఏప్రిల్ ౨౮: ఇరాన్ నుంచి చము రు నిల్వలతో ఇతర దేశాలకు వెళ్లే నౌకలు లేదా ఇతర దేశాల నుంచి ఇరాన్‌కు సరుకులతో వచ్చే నౌకలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపో యాయి. అక్కడి ఓడరేవులను అమెరికన్ సై న్యం దిగ్బంధించడమే అందు కు కారణం. అదే విధంగా హోర్ముజ్ జలసంధి వద్ద కూ డా ఇదే పరిస్థితి నెలకొంది.

దీంతో సుమారు 155 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ ముడి చమురు నిల్వలు సముద్ర జలాల్లోనే నిలిచినట్లయింది. ముఖ్యంగా ఇరాన్‌లోని చాబ హార్ రేవు వద్ద ఎక్కువ సంఖ్యలో నౌకలు నిలిచిపోయాయి. ఉత్పత్తి చేసిన చమురును నిల్వ చేసే సామర్థ్యం అయిపోతున్నందున టెహ్రాన్ త్వరలోనే ఉత్పత్తిని నిలిపివేసే అవకాశం ఉంది. ఈ పరిణామం అంతర్జాతీయ మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.