29 April, 2026 | 2:14 AM

బెంగాల్‌లో నేడు తుది విడత ఎన్నికలు

29-04-2026 12:27 AM
  1. 142 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్
  2. పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన ఈసీ

కోల్‌కతా, ఏప్రిల్ ౨౮: పశ్చిమ బెంగాల్ తుది విడత అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ విడతలో 142 స్థానాలకు పోలిం గ్ జరుగనుంది. బుధవారం ఉదయం ౭ గంటల నుంచి సాయంత్రం ౬ వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సంఘం సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా ఉంచిం ది. శాంతి భద్రతల కోసం భారీగా కేంద్ర బలగాలను రంగంలోకి దించారు.

రాష్ట్రవ్యా ప్తంగా మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండ గా, ఎన్నికల సంఘం రెండు విడతల్లో పోలిం గ్ నిర్వహించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఈ నెల 23న 152 స్థానాలకు మొ దటి విడత పోలింగ్ జరిగింది. మొదటి విడతలో ఏకంగా 93 శాతం ఓటింగ్ నమోదైం ది. తద్వారా రాష్ట్రం అరుదైన రికార్డు నమో దు చేసింది. భారతదేశ చరిత్రలోనే ఇదే అత్యధిక ఓటింగ్ శాతం కావడం గమనార్హం. ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీ జేపీ మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది.