18 July, 2026 | 1:45 AM

ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్ ఆన్‌లైన్ వేగంగా పూర్తి చేయాలి

18-07-2026 01:45 AM

జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

ఖానాపూర్, జూలై 17 ( విజయక్రాంతి) రానున్న గోదావరి నది పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, శుక్రవారం ఖానాపూర్ మండలంలో పర్యటించారు. గోదావరి నది పుష్కర ఘాట్లను పరిశీలించారు. పట్టణంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్ డిజిటలైజేషన్ తీరును చూశారు. ముందుగా ఖానాపూర్ పట్టణంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారముల డిజిటలైజేషన్ సరళిని చూశారు. తప్పనిసరిగా గడువులోగా ఆన్ లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. మొత్తం ఓటర్ల సంఖ్య, ఇప్పటి వరకు తిరిగి తీసుకున్న ఫారములు, పూర్తిచేసిన ఆన్ లైన్ వివరాలు అధికారులను అడిగారు.

బిఎల్‌ఓ యాప్ ను పరిశీలించారు. ప్రక్రియను మొత్తం పారదర్శకంగా చేయాలని అన్నారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని చెప్పారు. బూత్ లెవెల్ అధికారులు తప్పనిసరిగా క్షేత్ర స్థాయిలో ఓటర్లకు ఫారములు నింపుటలో సహకారం అందించాలని చెప్పారు.ఈ కార్యక్రమాలలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, తహసిల్దార్ సుజాత, ఎంపీడీవో రాధా రాథోడ్, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ సోయబ్ హుస్సేన్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.