22 July, 2026 | 2:29 AM

ఎస్‌ఐఆర్‌ను సకాలంలో పూర్తి చేయాలి

22-07-2026 02:29 AM
  1. ఆన్‌లైన్ సమర్పణలో హార్డ్‌కాపీ కోసం ఓటర్లను బీఎల్‌వోఒ ఇబ్బంది పెట్టొద్దు
  2. వీవీఐపీ, వీఐపీ పేర్లు ఉండేలా చూసుకోవాలి
  3. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను సకాలంలో పూర్తయ్యేలా సంబంధిత ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఐఎఎస్ ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధి కారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారమ్‌లను ఆన్‌లైన్‌లో సమర్పించినట్లయితే హార్డ్‌కా పీ కోసం బీఎల్‌ఒలు ఓటర్లను ఇబ్బంది పెట్టొద్దన్నారు. ఎన్యుమరేషన్ ఫారం సమర్పించే టప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరి కాదని, ఓట ర్లు ఎన్యుమరేషన్ ఫారంలను సమర్పించేందుకు అవసరమైన సహాయాన్ని అందించి, వారి ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. అలాగే ఓటరు జాబితాల్లో వీవీఐపీ, వీఐపీ ఓటర్ల పేర్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలన్నారు.

గైర్హాజరు, నివాసం మారిన, మర ణించిన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిం చి రికార్డుల్లో నమోదు చేయాలని సూచించా రు. డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రాజకీయ పార్టీలతో నిర్వహించే సమావేశాల్లో పారదర్శకత పాటి స్తూ, సంబంధిత వివరాలను నమోదు చేయాలని, పట్టణ ప్రాంతాలు, పురోగతి తక్కువ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఈ వారంలోగా ప్రతి జిల్లాలో ఎన్యుమరేషన్ ప్రక్రియ 90శాతం పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే నో మ్యాపింగ్ కేటగిరీలో ఉన్న ఓటర్లను పూర్తిస్థాయిలో ధృవీకరించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎస్‌ఐఆర్--2026 కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయడానికి సంబంధిత ఎన్నికల అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్. వాసం వెంకటేశ్వర్ రెడ్డి, ఉప ప్రధాన ఎన్నికల అధికారి జీఎస్ చారీ తదితరుల పాల్గొన్నారు.