31 August, 2026 | 10:14 PM

Breaking News

కొమరం భీమ్ నగర్ గ్రామంలో త్రాగునీటి సమస్య కు పరిష్కారం చూపండి   •   ప్రజల సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్యం   •   ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే జాగో తెలంగాణ యాత్ర   •   ఆదివాసి బిడ్డ శిరీషపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను శిక్షించాలి   •   సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి   •   పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలి   •   బిజెపి నాయకులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి   •   మహబూబ్‌నగర్–డోన్ రైల్వే డబుల్ లైన్‌కు భూసేకరణ త్వరలో పూర్తి   •   కాంగ్రెస్‌ను ప్రజా కోర్టులో దోషిగా నిలబెడతాం.!   •   24 గంటల విద్యుత్‌ కోసం రైతుల ధర్నా   •  

‘సర్’ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి

13-07-2026 12:24 AM

ట్రెయినీ కలెక్టర్ అహ్మద్ పాషా 

చేగుంట, జూలై 12: ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంను సమర్థవంతంగా,ఎటువంటి అలసత్వం లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని ట్రైనింగ్ కలెక్టర్ అహ్మద్ పాషా చేగుంట  బిఎల్ వో లకు సూచించారు. చేగుంట గ్రామ పంచాయతీ కార్యాలయంలో  పోలింగ్ బూత్లలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, ఉపసర్పంచ్ రఫీ కలిసి ఆదివారం నాడు పరిశీలించారు.

అధికారులు ఓటర్ల నుంచి వినతులు స్వీకరించి, సందేహాలకు సమాధానాలు అందిస్తూ సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని,ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.పోలింగ్ బూత్లలో జరుగుతున్న నమోదు ప్రక్రియ, ప్రజలకు అందుతున్న సేవలు, దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, పట్టణ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.