కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేయాలి
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్
కరీంనగర్,జూలై12(విజయక్రాంతి):తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో కన్నెపల్లి పంప్హౌస్ మోటార్లను ఆన్ చేసి నీటిని విడుదల చేయ డం ఒక్కటే మార్గమని మాజీ మంత్రి కొప్పు ల ఈశ్వర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ కన్నెపల్లి మో టార్లను వెంటనే ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని కోరుతూ రిటైర్డ్ ఇంజనీర్ల సం ఘం, ముఖ్యంగా రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారని పే ర్కొన్నారు.
ఈ లేఖ రాసినందుకు గానూ తె లంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను జైల్లో పెట్టాలని, వారిని బొక్కలో వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడంపై కొ ప్పుల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దశాబ్దాల కాలంగా ఇరిగేషన్ శాఖలో పనిచేసి, రాష్ట్ర పరిస్థితులపై అవగాహన ఉన్న రిటైర్డ్ ఇంజనీర్లు రైతుల పక్షాన ఇచ్చిన మంచి సలహాలను ప్రభుత్వం సానుకూలంగా తీసుకో లేదని విమర్శించారు.ఒక బాధ్యత గల ప్రభుత్వం అయితే నీటిని లిఫ్ట్ చేయడం సా ధ్యమా కాదా అనే విషయాలపై స్పష్టత ఇ వ్వాలి లేదా సంబంధిత అధికారులతో మా ట్లాడించాలి,
కానీ దాన్ని వదిలేసి సలహాలు ఇచ్చిన వారిపై ఇష్టానుసారంగా మాట్లాడ డం ముఖ్యమంత్రి అహంకారానికి నిదర్శనమని ఆరోపించారు.నదిలో దాదాపు 98 టీఎంసీల నీరు వృథాగా కొట్టుకుపోతోందని, ఆ రోజు తాము స్పష్టంగా చెప్పినట్లుగా మేడిగడ్డ దగ్గర గేట్లు వేయకుండా, నీటిని ఆపకుండానే అక్కడ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి పంప్హౌస్ నుండి నీ టిని పంప్ చేయవచ్చని వివరించారు. గ తంలో కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, పనికిరాదని, లక్ష కోట్లు మునిగిపోయాయని
ఈ ప్రభుత్వం ప్రచారం చేసిందని; ఇప్పుడు అదే ప్రాజెక్టు ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తే తాము చెప్పినవన్నీ అబద్ధాలని తేలిపోతుందనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఇష్టపడడం లేదని ఆరోపించారు. సమావేశంలో మాజీ మేయర్ రవీందర్ సింగ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణారావు, ముత్యాల బలరాం రెడ్డి, ఏలేటి కృష్ణ రెడ్డీ పాల్గొన్నారు.






