calender_icon.png 9 January, 2026 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తమ్ముడి మరణ వార్త విని ఆగిన అక్క గుండె

07-01-2026 01:03:02 AM

  1. గంటల వ్యవధిలో ఇద్దరి మరణం
  2. నిజామాబాద్‌లో ఘటన

నిజామాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): తమ్ముడి మరణ వార్త విన్న అక్క గుండెపోటు తో మృతిచెందిన ఘటన నిజామాబాద్ పట్టణంగా మంగళవారం జరిగింది. నిజామాబా ద్ నగరంలోని కోజా కాలనీకి చెందిన మహమ్మద్ చౌస్ (26) బోధన్ రోడ్డులోని ఓ వైన్ షాప్ ముందు సోమవారం రాత్రి విగత జీవిగా పడి ఉన్నాడు.

చూసిన స్థానికులు అతని చిరునామా కనుక్కొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తమ్ముడి మృతి చెందాడన్న వార్తను తట్టుకోలేని అతని అక్క పర్వీన్ బేగం గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచింది. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.