calender_icon.png 10 January, 2026 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పలువురికి ఎమ్మెల్యే కృష్ణారావు పరామర్శ

07-01-2026 01:04:21 AM

కూకట్‌పల్లి, జనవరి 6 (విజయక్రాంతి): కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోనీ పలు కుటుంబాలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. ఇటీవల  కేపిహెచ్ బి డివిజన్ వసంత నగర్ మహిళ మండలి వైస్ ప్రెసిడెంట్ టీ.సుశీల భర్త ఆంజనేయులు, బాలానగర్ డివిజన్‌లో  రాజు కాలనీ కి చెందిన ఏరుకుల నరసింహ కుమారుడు దీపు ( 32 ), చెరబండ రాజు కాలనీ కి చెందిన యాదయ్య మృతి చెందారు. మంగళవారం బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు పరామర్శించారు.   ప్రమాదానికి గురై  చికిత్స చేయించుకున్న బాలానగర్ డివిజన్లో రాజు కాలనీ కి చెందిన కుమార్ (బాడీబిల్డర్) ఇంటికి వెళ్ళి ఆరోగ్య సమాచారం  తెలుసుకొన్నారు