07-01-2026 01:02:02 AM
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి
సికింద్రాబాద్ జనవరి 6 (విజయ క్రాంతి): పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు నిరంతర మెరుగైన ఉచిత ఆరోగ్య సేవలు అందాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి వైద్యాధికా రులను ఆదేశించారు. మంగళవారం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి సమావేశ మందిరం లో వివిధ ప్రోగ్రామ్ అధికారులు,ఎస్ పి హెచ్‌ఓలు, వైద్య అధికారులు, సూపర్వైజర్స్ సిబ్బందికి నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని పలు ఆరోగ్య కార్యక్రమా లను సమీక్షించారు.
ఈ సందర్భంగా డాక్టర్ వెంకట్ మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందాలని సూచించారు.ప్రతి యూపీహెచ్సీల్లో గర్భిణీల రిజిస్ట్రేషన్ సంఖ్య పెరగాలని, ప్రభుత్వ లక్ష్యాలను ఆస్పత్రి వైద్యాధికారులు నిబద్ధతతో బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీధర్,డాక్టర్ జయశ్రీ , ఇన్చార్జ్ అడిషనల్ డి యం & హెచ్ ఓ, సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్స్, డాక్టర్ శ్రీకళ ,డాక్టర్ ఆశ్రిత రెడ్డి, డాక్టర్ శ్రీ లక్ష్మి ప్రోగ్రామ్ ఆఫీసర్స్, జిల్లా మాస్ మీడియా అధికారి జక్కుల రాములు, వైద్యాధికారులు, సూపర్వైజర్ సిబ్బంది పాల్గొన్నారు.