4 May, 2026 | 1:24 AM

ప్రభుత్వాలు మారితే ఇంతేనేమో!

02-06-2024 12:05 AM

ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాత ప్రభుత్వాల అవకతవకలు వెలుగు చూడటం సాధారణమే. ఒకవేళ ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వం దఫాల తరబడి అధికారంలో వుంటే దాని హయాంలో జరిగేవన్నీ సక్రమమే అనుకొనే ప్రమాదం ఉంటుంది. ఇందుకు భిన్నంగా ప్రజలు మరో పార్టీకి అధికారం అప్పగించినప్పుడు అసలు అవకతవకలు బయటపడే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఈమధ్య వెలుగులోకి వస్తున్న కుంభకోణాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల స్కాం జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఇదే అంశంపై ఇవాళ్టి ‘విజయక్రాంతి’ సంపాదకీయం వాస్తవ స్థితికి అద్దం పట్టింది. అవినీతి ప్రక్షాళన ఇప్పటికైనా జరిగితే కొత్త ప్రభుత్వం పట్ల ప్రజలకు నమ్మకం పెరుగుతుంది.


-గిరిజాకుమార్, కూకట్‌పల్లి