26 April, 2026 | 9:34 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

ఆరో రోజూ నష్టాలే

13-02-2025 01:22 AM

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల నష్టాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఆరో రోజూ సూచీలు నష్టపోయాయి. ఓ దశ లో సూచీలు భారీ నష్టాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్ 76 వేలు, నిఫ్టీ 23 వేల దిగువకు చేరాయి. అయితే, మళ్లీ అంతే స్థాయిలో సూచీలు బలం గా పుంజుకోవడం, స్వల్ప నష్టాలకే సూచీలు పరిమితం కావడం మదుపర్లకు ఊరటనిచ్చే అంశం. రిలయన్స్, మహీంద్రా అండ్ మహీం ద్రా, ఐటీసీ షేర్లు సూచీలపై ఒత్తిడి పెంచగా.. హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి.

సెన్సెక్స్ ఉదయం 76,188.24 పాయింట్ల వద్ద  నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంది. ఓ దశలో దాదాపు 900 పాయింట్ల నష్టంతో 75,388.39 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. అంతే బలంగా పుంజుకొని 76,459 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 122.52 పాయింట్ల నష్టంతో 76,171.08 వద్ద ముగిసింది. నిఫ్టీ 27.80 పాయింట్ల నష్టంతో 23,044 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 9 పైసలు బలహీన పడి 86.88 వద్ద ముగిసింది.

సెన్సెక్స్ 30 సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 76 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు కాస్త తగ్గుముఖం పట్టి 2910 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.